ఎన్‌టీపీసీలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు

ఎన్‌టీపీసీలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు

న్యూదిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) వివిధ విభాగాల్లో డిప్యూటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 135

వివరాలు:

  • డిప్యూటీ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌): 40

  • డిప్యూటీ మేనేజర్‌ (మెకానికల్‌): 55

  • డిప్యూటీ మేనేజర్‌ (సీ&ఐ): 40

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.70,000- రూ.2,00,000.

వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీలకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్విస్‌మెన్‌/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 26.08.2026.

Website: https://careers.ntpc.co.in/recruitment/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram