ఇండ్‌బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు

ఇండ్‌బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు

ఇండియన్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన ఇండ్‌బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (IBMBS LTD) రిలేషన్‌షిప్ మేనేజర్, డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివరాలు:

  1. రిలేషన్‌షిప్ మేనేజర్ : 08

  2. డీలర్ - స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ : 06

విభాగాలు: స్టాక్ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్‌మెంట్, మ్యూచువల్ ఫండ్స్, డెబ్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్, క్యాపిటల్ మార్కెట్ తదితర విభాగాలు...

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 01.07.2026 నాటికి 21 నుంచి 35 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రిలేషన్‌షిప్ మేనేజర్ కు రూ.33,300 - రూ.41,600. పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్. డీలర్ కు రూ.35,000

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా recruitment@indbankonline.com కు పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 ఆగస్టు 31.

Website: https://www.indbankonline.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram