అగ్ని పర్వతాలు

అగ్ని పర్వతాలు

భూగర్భంలో ఉన్న శిలాద్రవం ఉపరితలానికి చేరడానికి ఉపయోగపడే మార్గమే అగ్ని పర్వతం. భూమి లోపలి పొరల్లో ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా అక్కడి శిలలు కరిగి, ద్రవరూపంలోకి మారతాయి. ఈ శిలాద్రవం అనుకూల పరిస్థితుల్లో అగ్ని పర్వతాల రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. భూ అంతర్భాగంలో వాయువులతో కూడి ఉన్న శిలాద్రవాన్ని ‘మాగ్మా’ అంటారు. భూ ఉపరితలాన్ని చేరిన శిలాద్రవాన్ని ‘లావా’గా పేర్కొంటారు. భూమిపై ఉన్న భౌగోళిక స్వరూపాల్లో క్రియాశీలత దృష్ట్యా అగ్ని పర్వతాలు ముఖ్యమైనవి. పోటీ పరీక్షల నేపథ్యంలో వీటి గురించి ముఖ్య విషయాలు తెలుసుకుందాం..!

రకాలు 

  • ఆవర్తన స్థాయి, విస్ఫోటనం, ఉద్భేదనం ప్రాతిపదికగా అగ్నిపర్వతాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:
  • 1. క్రియాశీల అగ్నిపర్వతాలు (Active Volcanoes): తరచుగా లేదా నిరంతరం విస్ఫోటనం చెందేవి. ఉదా: స్ట్రంబోలి, ఎట్నా, బారెన్‌ మొదలైనవి.
  • 2. నిద్రాణ అగ్నిపర్వతాలు (Dormant Volcanoes): గతంలో విస్ఫోటనం జరిగి, ప్రస్తుతం క్రియాశీలకంగా లేనివి. ఇవి భవిష్యత్తులో విస్ఫోటనం చెందొచ్చు. ఉదా: ఇటలీలోని వెసూవియస్, జపాన్‌లోని ప్యూజియామా.
  • 3. విలుప్త అగ్నిపర్వతాలు (Extinct Volcanoes): ఇవి వర్తమానంలో లేదా భవిష్యత్తులో విస్ఫోటనం చెందలేవు. ఉదా: నార్కొండం (భారతదేశం), కిలిమంజారో (టాంజానియా).

అగ్నిపర్వతాల ద్వారా వెలువడే పదార్థాలు

  • అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల అనేక రకాల పదార్థాలు భూ అంతర్భాగం నుంచి బయటికి వస్తాయి. ఇవి ఘన, ద్రవ, వాయు రూపంలో ఉంటాయి.
  • టుఫ్‌ - నీరు, ధూళి, శిలాభస్మాల కలయికవల్ల ఏర్పడే రాయి లాంటి పదార్థం.
  • స్కోరియా - నురగతో కూడిన శిలాద్రవం ఘనీభవించాక ఏర్పడిన పదార్థం.
  • ప్యూమైస్‌ - నీటిలో తేలే శిల.
  • లాపిలి - గులకరాయి పరిమాణంలో ఉన్న రాళ్లు.
  • ఎగ్లోమరేట్‌ - స్కోరియా, ప్యూమైస్, శిలాభస్మాల కలయికతో ఏర్పడిన మిశ్రమ శిలలు.

కొన్ని ముఖ్యాంశాలు: 

  • అగ్నిపర్వత ఉద్భేదనం తీవ్రంగా ఉన్నప్పుడు అగ్నిపర్వత ముఖం (క్రేటర్‌) పేలిపోయి, దాని స్థానంలో పెద్దపెద్ద గుంటలు ఏర్పడతాయి. కాలక్రమేణా వీటిలో నీరు చేరి సరస్సులుగా మారతాయి. వీటినే ‘కాల్దేరా’ సరస్సులు, జ్వాలాబిల సరస్సులు అంటారు. ఉదాహరణకు మహారాష్ట్రలోని లూనార్‌ సరస్సు. 
  • అగ్నిపర్వత సంబంధ ప్రక్రియ వల్ల ఏర్పడే వేడినీటి బుగ్గలను గీజర్లు అంటారు. ఉదా: అమెరికా ఎల్లోస్టోన్‌ నేషనల్‌ పార్కులోని ఓల్డ్ఫియిత్‌ ఫుల్‌ గీజర్‌. 
  • అగ్నిపర్వతం విస్ఫోటం చెందినప్పుడు వేడినీటితోపాటు బురద కూడా ప్రవహిస్తే దాన్ని ‘పంకాగ్ని అగ్నిపర్వతం’ అంటారు. ఇలాంటివి సిసిలీ, ఉత్తర న్యూజిలాండ్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. 

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ జైలు వార్డర్‌ ఆఫీసర్‌ పేపర్, 2024)

Q: భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని కింది ఏ ద్వీప సమూహంలో ఉంది?

1) లిటిల్‌ అండమాన్‌ ద్వీపం        2) బారెన్‌ ద్వీపం

3) నార్కొండం ద్వీపం            4) కార్‌ నికోబార్‌ ద్వీపం

సమాధానం: 2

(హెచ్‌పీపీఎస్‌సీ జీఎస్, 2017)

Q: కిందివాటిలో ఏ ప్రాంతంలో అధిక సంఖ్యలో క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి?

1) అలస్కా                2) అలూటియన్‌ దీవులు

3) హవాయి దీవులు        4) ఐస్‌లాండ్‌

సమాధానం: 2

(SSC JE Electrical, 2023)

Q: These volcanoes are mostly made up of basalt, a type of lava that is very fluid when erupted. For this reason, these volcanoes are not steep. Which of the following volcano is an example of the above given type of volcano?                                 
1) Mount Rainier Volcano        2) Hawaiian Volcano
3) Mayon Volcano            4) Mount Shasta Volcano
Answer: 2

 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram