సర్‌ గ్యారీ సోబర్స్‌ మరణం

సర్‌ గ్యారీ సోబర్స్‌ మరణం
  • టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరొందిన వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ గ్యారీ సోబర్స్‌ 2026, జులై 17న మరణించారు. ఆయన వయసు 89 ఏళ్లు. వెస్టిండీస్‌ టెస్టుల్లో మేటి జట్టుగా ఎదగడంలో సోబర్స్‌ పాత్ర ఎంతో కీలకం. 1954-74 మధ్య సుదీర్ఘ కెరీర్లో 93 టెస్టులాడిన ఈ ఎడమచేతి బ్యాటర్‌.. 57.78 సగటుతో 8,032 పరుగులు సాధించారు. అందులో 26 శతకాలు, 30 అర్ధశతకాలు ఉన్నాయి. 
  • 1965-72 మధ్య 39 టెస్టుల్లో వెస్టిండీస్‌కు నాయకత్వం వహించిన సోబర్స్‌.. 9 విజయాలందించారు. ఆయన సారథ్యంలో 10 మ్యాచ్‌లు ఓడిన విండీస్‌.. 20 టెస్టులను డ్రా చేసుకుంది. 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram