ఎస్‌.జానకి మరణం

ఎస్‌.జానకి మరణం
  • విఖ్యాత గాయని ఎస్‌.జానకి (88) 2026, జులై 11న కర్ణాటకలోని మైసూరులో మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జల్లా రేపల్లె తాలూకా పల్లపట్లలో 1938 ఏప్రిల్‌ 23న జానకి జన్మించారు. ఏవీఎం స్టూడియోలో సంగీత దర్శకులు ఆర్‌.సుందరం వద్ద నేపథ్య సంగీతాన్ని నేర్చుకున్నారు. 1950లో చెన్నై వెళ్లిన జానకి 1957లో తొలిసారిగా సినీ నేపథ్య గీతాన్ని ఆలపించారు. 19 ఏళ్ల వయసులో తమిళ చిత్రం ‘విధియిన్‌ విలయట్టు’ చిత్రంలో టి.చలపతిరావు సంగీతంలో గాయనిగా రంగ ప్రవేశం చేశారు. తొలి ఏడాదిలో ఆరు భాషల్లో పాటలు ఆలపించారు. 
  • 2017లో ఇకపై పాటలు పాడబోనని అధికారికంగా ప్రకటించే నాటికి మొత్తం 48 వేల గీతాలను పాడారు. 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram