భాగ్యరాజ్‌ కన్నుమూత

భాగ్యరాజ్‌ కన్నుమూత

ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ (73) చెన్నైలో మరణించారు. తమిళనాడుకు చెందిన ఆయన కథానాయకుడు, స్క్రీన్‌ప్లే రైటర్, నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞతో పేరుగాంచారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా తొలిచిత్రం ‘16 వయతినిలే’తో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన భాగ్యరాజ్‌ ‘పుతియ వార్పుగళ్‌’ (1979) ద్వారా కథానాయకుడిగా తెరపై కనిపించారు.భారతీరాజా దగ్గర శిష్యరికం చేసిన భాగ్యరాజ్‌ నటుడిగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. సుమారు 100 చిత్రాలకు పని చేశారు. 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram