ఆంథోనీ అల్బనీస్‌తో మోదీ భేటీ

ఆంథోనీ అల్బనీస్‌తో మోదీ భేటీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 9న మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్‌-ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలోనూ పాల్గొన్నారు. అణు ఇంధనాన్ని, విలువైన ఖనిజాలను సరఫరా చేయడం; పునరుత్పాదక ఇంధనం, విద్య, నౌకాయాన భద్రత, ఓడల నిర్మాణం/ మరమ్మతులు సహా 18 ఒప్పందాలపై రెండు దేశాలూ సంతకాలు చేశాయి. బొగ్గు, ద్రవ ఇంధనాలు, సహజవాయువు సరఫరా అంశం కూడా దీనిలో ఉంది. రక్షణ పరిశ్రమల రంగంలో సహకార బలోపేతం, ఆయుధాలను సంయుక్తంగా ఉత్పత్తి చేయడం, ఒకరి భూభాగం నుంచి మరొకరి విమానాలను మోహరించడం వంటి కీలకాంశాలు ఉన్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram