ఏరోమార్ట్‌ - 2026

ఏరోమార్ట్‌ - 2026
  • అత్యాధునిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల్లో వినియోగించే కీలక విడిభాగాల తయారీలో తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో తన ముద్ర వేస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ‘ఏరోమార్ట్‌ హైదరాబాద్‌-2026’ పేరిట నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
  • తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగం ఏటా సుమారు 30% వార్షిక వృద్ధిని నమోదు చేస్తోందని,  గతేడాది ఈ రంగాల ఎగుమతులు 103% పెరిగి తొలిసారిగా ఫార్మా రంగ ఎగుమతులను అధిగమించాయని మంత్రి వెల్లడించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram