మహిళలపై హింస, అకృత్యాల నిర్మూలన అనేవి ప్రతి దేశం సాధించాల్సిన ప్రధాన లక్ష్యాలు. స్త్రీలు తమ ఇళ్లలో, కార్యాలయాలు, అన్ని బహిరంగ ప్రదేశాల్లో వీటిని ఎదుర్కొంటున్నారు. ఇది కేవలం చట్టపరమైన సమస్యే కాదు. మానవ హక్కుల ఉల్లంఘనను సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నేటికీ మహిళలపై దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుత నవీన నాగరికతలోనూ అనేకమంది కనీస మానవ హక్కులకు నోచుకోవడం లేదు. ఆర్థిక స్వాతంత్య్రం లేక, నిత్యం ఆంక్షలు, అణచివేతలతో అనేక విధాలుగా స్త్రీలు వివక్షకు గురవుతున్నారు. శారీరక, మానసిక వేధింపుల నుంచి ఆర్థిక దోపిడీ వరకు వివిధ రూపాల్లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టే లక్ష్యంతో ఏటా నవంబరు 25న ‘మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం’గా (International Day for the Elimination of Violence against Women) నిర్వహిస్తారు. మహిళల హక్కులను కాపాడటంతోపాటు లింగ ఆధారిత హింస వల్ల కలిగే సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం, 2023లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ముగ్గురిలో ఒకరు, మొత్తంగా 84 కోట్ల మంది వారి జీవితకాలంలో లైంగిక హింస ఎదుర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 15-49 ఏళ్ల వయసున్న మహిళల్లో నాలుగోవంతు (25.8%), 15 ఏళ్లు - అంతకంటే ఎక్కువ వయసు వారిలో 24.7% కనీసం తమ జీవితంలో ఒక్కసారైనా వారి భాగస్వాముల ద్వారా శారీరక/ మానసిక/ లైంగిక హింసకు గురయ్యారు.
- ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం (UN Women), ఐరాసకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ సంయుక్తంగా ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై పురోగతి: జెండర్ స్నాప్షాట్ 2025’ అనే నివేదికను విడుదల చేశాయి. 2030 నాటికి సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (ఎస్డీజీ) కవర్ చేస్తూ, ఈ నివేదిక లింగ సమానత్వం గురించిన అంశాలను వివరించింది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2020 నుంచి మహిళల్లో తీవ్ర పేదరికం 10% వద్దే కొనసాగుతోంది.
- ప్రస్తుత ధోరణులు ఇలాగే ఉంటే 2030 నాటికి 35.1 కోట్లమందికి పైగా మహిళలు, బాలికలు తీవ్ర పేదరికంలో ఉండే ముప్పు ఉంది. ఎస్డీజీని వేగవంతం చేయడం ద్వారా మహిళల్లో తీవ్ర పేదరికాన్ని 2025 నాటికి ఉన్న 9.2% నుంచి 2050 నాటికి 2.7 శాతానికి తగ్గించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పురుషులతో పోలిస్తే దాదాపు 6.40 కోట్ల మందికి పైగా వయోజన మహిళలకు ఆహార భద్రత లేదు. మహిళల్లో రక్తహీనత బాధితుల శాతం 2025లో 31.1% ఉండగా 2030 నాటికి అది 33 శాతానికి చేరుతుందని అంచనా.
- నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం, మన దేశంలో 2024లో మహిళలపై 4.41 లక్షల నేరాలు నమోదవగా 2023లో నమోదైన కేసుల సంఖ్య 4.48 లక్షలు. మహిళలపై జరిగిన నేరాల్లో అత్యధికం భర్త, బంధువుల నుంచి ఎదురయ్యే క్రూరత్వానికి సంబంధించినవే. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలకు సంబంధించి 2,965 కేసులతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, మహారాష్ట్ర రెండో స్థానంలో (1,473), తెలంగాణ (1,025) మూడో స్థానంలో నిలిచాయి.
చారిత్రక నేపథ్యం
1993, డిసెంబరు 20న యూఎన్ఓ మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఒక ప్రకటనను ఆమోదించింది. ఏటా నవంబరు 25న ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్’గా జరుపుకోవాలని 2000, ఫిబ్రవరి 7న యూఎన్ఓ జనరల్ అసెంబ్లీ అధికారికంగా తీర్మానించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
2026 నినాదం: "UNiTE to End Violence Against Women and Girls: Ensure justice, protect survivors, end impunity."
| మహిళలపై హింస నిర్మూలనకు ఐరాస ప్రకటన, చారిత్రక నేపథ్యం, జాతీయ మహిళా కమిషన్, భారతీయ న్యాయ సంహిత - 2023 తదితర ముఖ్య సమాచారంతోపాటు గతంలో ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, యూజీసీ నెట్ తదితర పోటీపరీక్షల్లో ఈ టాపిక్ నుంచి అడిగిన 110కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కాంబో కోర్సు’కి సబ్స్క్రైబ్ చేసుకోండి! వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. ‘ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ వయొలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్’ను ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఎంపీఎస్సీ సబార్డినేట్ సర్వీసెస్ కంబైన్డ్ గ్రూప్ బి (ప్రిలిమ్స్), 2017),
(కేరళ పీఎస్సీ సివిల్ ఎక్సైజ్, 2018),
(యూపీ పోలీస్ ఎస్ఐ, 2017), (మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ (ఔరంగాబాద్), 2021),
(ఆర్ఆర్బీ ఎన్టీపీసీ (గ్రాడ్యుయేట్), 2026)
1) నవంబరు 25 2) డిసెంబరు 10
3) డిసెంబరు 16 4) డిసెంబరు 25
సమాధానం: 1
2. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పించడం అనేది ఒక.....
(కేపీఎస్సీ కేఏఎస్ (ప్రిలిమ్స్), 2020)
1) రాజ్యాంగపరమైన హక్కు 2) ప్రాథమిక హక్కు
3) మానవ హక్కు 4) చట్టపరమైన హక్కు
సమాధానం: 4
3. మహిళలపై హింసను నిర్మూలించే ప్రకటనను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కింది ఏ సంవత్సరంలో ఆమోదించింది?
(యూపీ పోలీస్ ఎస్ఐ, 2021)
1) 1981 2) 1988 3) 1979 4) 1993
సమాధానం: 4
4. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం, 2005లోని సెక్షన్ 31 ప్రకారం, రక్షణ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ప్రతివాదికి విధించదగిన గరిష్ఠ కారాగార శిక్ష ఏది?
(రాజస్థాన్ పోలీస్ కానిస్టేబుల్, 2022)
1) ఏడాది 2) రెండేళ్లు 3) మూడేళ్లు 4) ఆరు నెలలు
సమాధానం: 1
5. The International Day for the Elimination of Violence against Women marks the beginning of which global campaign?
(RRB NTPC (UG) CBT-I, 2026)
1) 30 Days of Human Rights Protection
2) 10 Days of Equality
3) 16 Days of Activism against Gender-Based Violence
4) 7 Days for Women
Ans: 3
6. In September 2024, the Supreme Court has affirmed that the Protection of Women from Domestic Violence Act,__ applies to all women in India regardless of their religion or social background.
(SSC CHSL Tier-1, 2025)
1) 2001 2) 2003 3) 2005 4) 2007
Ans: 3
7. Analyze the following statements regarding women's safety initiatives in Madhya Pradesh:
(SSC GD Constable, 2024)
I. The inaugural 'Mahila Thana' was launched in Bhopal in 1987.
II. 'Gauravi Mission' is a one-stop support center providing medical, legal, and psychological aid.
III. 'Maitra Police Patrolling' involves male officers on two-wheelers in major metros.
1) I and II only 2) II and III only
3) I and III only 4) All of the above
Ans: 1
8. What does the Bharatiya Nyaya Sanhita (BNS), 2023 propose regarding the role of digital evidence in criminal cases?
(SSC CGL, 2026)
1) Digital evidence can only be used if it is manually compiled
2) Digital evidence is not admissible in court without physical copies
3) Digital evidence must be verified and authenticated for it to be used in court
4) All digital evidence is automatically accepted in legal proceedings
Ans: 3
9. Under the Bharatiya Nyaya Sanhita (BNS), 2023, the term "Document" is defined under which section?
(SSC Stenographer, 2026)
1) Section 2(6) 2) Section 2(8)
3) Section 2(10) 4) Section 2(12)
Ans: 2
10. The SHe-Box platform highlighted in government communications during 2026 is primarily associated with the implementation of which legislation?
(RRB Group D, 2026)
1) Dowry Prohibition Act, 1961
2) Protection of Women from Domestic Violence Act, 2005
3) Sexual Harassment of Women at Workplace Act, 2013
4) Prohibition of Child Marriage Act, 2006
Ans: 3