జాతీయ జెండా ఆమోద దినోత్సవం

జాతీయ జెండా ఆమోద దినోత్సవం

భారతదేశ ఐక్యత, సార్వభౌమత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక మన మువ్వన్నెల జెండా. మన త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ 1947, జులై 22న జరిగిన సమావేశంలో ఆమోదించింది. ఈ కారణంగానే ఏటా ఆ తేదీన మన దేశంలో ‘జాతీయ జెండా ఆమోద దినోత్సవాన్ని’ (National Flag Adoption Day) నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడి, ప్రాణత్యాగాలు చేసిన సమరయోధులకు నివాళులు అర్పించడంతోపాటు ప్రతి పౌరుడు జాతీయ పతాకాన్ని, అది సూచించే ఆదర్శాలను గౌరవించేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

  • మన పతాకం దీర్ఘచతురస్రాకారంలో, 3 : 2 పొడవు - వెడల్పు నిష్పత్తిలో ఉంటుంది. జాతీయ జెండాలోని మూడు రంగులు సూచించే అంశాలు: పైన ఉండే కాషాయం - ధైర్యం, త్యాగం; మధ్యలో ఉండే తెలుపు - శాంతి, సత్యం, స్వచ్ఛత; కింద ఉండే ఆకుపచ్చ - శ్రేయస్సు. జెండాలోని తెలుపు పట్టీ మధ్య భాగంలో ముదురు నీలం రంగులో ఉండే అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది. ఇందులో మొత్తం 24 గీతలు (spokes) ఉంటాయి. 
  • ప్రస్తుత జాతీయ పతాకాన్ని రూపొందించిన ఘనత తెలుగువారైన పింగళి వెంకయ్యకు దక్కుతుంది. మన దేశానికి ప్రత్యేక పతాకం ఉండాలనే ఆలోచన ఆయనకు 1906లో కలిగింది. ఆ ఏడాది కోల్‌కతాలో జరిగిన 22వ అఖిల భారత కాంగ్రెస్‌ సభలో సమావేశ ప్రారంభానికి ముందు బ్రిటిష్‌ వారి పతాకమైన యూనియన్‌ జాక్‌ను ఎగురవేశారు. ఇది వెంకయ్యకు నచ్చలేదు. దీంతో ఒక జాతికి, అది నిర్వహించే ఉద్యమానికి పతాకం అవసరమని భావించి, జెండా తయారీకి పూనుకున్నారు.
  • 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో మహాత్మా గాంధీకి వెంకయ్య మూడు అడ్డ గీతలతో ఉన్న ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల జెండాను బహూకరించారు. గాంధీజీ సూచన మేరకు జెండా మధ్యలో రాట్నం గుర్తు ఉంచారు.  1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన పతాకంపై రాట్నం ఉండేలా వెంకయ్య రూపొందించిన జెండాలో మార్పులు చేశారు. దీన్ని కాంగ్రెస్‌ జాతీయ మహాసభ ఆమోదించింది. 
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, జాతీయ జెండాకు సంబంధించిన నిబంధనలు, ఫ్లాగ్‌ కోడ్‌ ఆఫ్‌ ఇండియా 2002 తదితర సమాచారంతోపాటు గతంలో యూపీఎస్సీ సివిల్స్, ఏపీ హైకోర్ట్‌ అసిస్టెంట్‌ ఎగ్జామినర్, తెలంగాణ హైకోర్ట్‌ జూనియర్‌ అసిస్టెంట్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ లాంటి పరీక్షల్లో అడిగిన 95కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారతదేశ మొదటి జాతీయ పతాకాన్ని 1906లో ఎక్కడ ఎగరవేశారు?

(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2021)

1) పట్నా    2) కోల్‌కతా        3) న్యూదిల్లీ      4) అహ్మదాబాద్‌

సమాధానం: 2

2. జాతీయ జెండా ఆమోద దినోత్సవాన్ని మన దేశంలో ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?

(ఎంపీ పట్వారీ, 2023)

1) జూన్‌ 2               2) జులై 9

3) ఏప్రిల్‌ 17              4) జులై 22

సమాధానం: 4

3. రాజ్యాంగ సభ కింది ఏ తేదీన త్రివర్ణ పతాకాన్ని ఆమోదించింది?

(యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్, 2020), (ఝార్ఖండ్‌ సివిల్‌ సర్వీస్, 2021),

(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2019), (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ డీఓఈ పీఆర్‌టీ, 2022),

(హెచ్‌పీ జేబీటీ టీఈటీ, 2018), (ఎన్‌టీపీసీ టైర్‌ 1, 2016),

(బీఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ ప్రిలిమ్స్, 2011)

1) 1947, జులై 22            2) 1947, ఆగస్టు 15

3) 1947, జనవరి 26          4) 1947, జూన్‌ 10

సమాధానం: 1

4. The National Flag of India consists of Ashoka Chakra also known as Samay Chakra consisting of _______ spokes.
(DSSSB NMDC PRT, 2022)
1) 28        2) 26        3) 24        4) 22
Ans: 3
5. Our National flag's length and width ratio is
(Madras High Court, 2022)
1) 4 : 2        2) 3 : 2         3) 3 : 3        4) 4 : 3 
Ans: 2 
6. The ______ of every state unfurls the flag in its capital on the Republic Day.
(SSC CGL Tier-I, 2024)
1) Judge of High Court        2) Chief Minister        3) Governor        4) Speaker
Ans: 3
7. Based on the 26th January 2002 legislation, what is NOT true with respect to the rules for flying the Indian Tricolour?
(NTPC CBT, 2017)
1) The flag cannot be intentionally allowed to touch the ground
2) The flag cannot be used for communal gains 
3) The tricolour cannot be used as a festoon, rosette or bunting
4) Private citizens have no right to fly the flag on their premise
Ans: 4
8. What is the importance of 22 July 1947? 
(RRB NTPC CBT-I Official Paper 2021)
1) National song adopted
2) Present National flag adopted
3) Leaders' discussion for selection of national anthem 
4) Session pre independence
Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram