దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి భారత్‌లో ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులే ఎక్కువగా ఉన్నాయి. వీటిపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేది కాదు. కొంతమంది ధనికులకు, వ్యాపారులకు మాత్రమే బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండేవి. ఆశించిన రీతిలో ఆర్థికాభివృద్ధి జరగలేదు. దీంతో ఇందిరా గాంధీ ప్రభుత్వం 1969, జులై 19న బ్యాంకులను జాతీయం చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పులకు కారణమైంది. పోటీ పరీక్షల నేపథ్యంలో దీని గురించి తెలుసుకుందాం..!
బ్యాంకుల జాతీయీకరణ అంటే?
|
జాతీయీకరణకు కారణాలు, లక్ష్యాలు, జాతీయం చేసిన బ్యాంకులు తదితర ముఖ్యాంశాలతోపాటు గతంలో ఈ అంశంపై పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. కింది ఏ సంవత్సరంలో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేశారు?
(డబ్ల్యూబీసీఎస్ ప్రిలిమ్స్, 2020)
1) 1969 2) 1980 3) 1971 4) 1991
సమాధానం: 1
2. బ్యాంకుల జాతీయీకరణ కింది ఏ ఉద్దేశంతో జరిగింది?
(ఓపీఎస్సీ ఓఏఎస్, 2018)
1) పరిశ్రమలకు ఆర్థిక సాయం అందించడం
2) రుణ సౌకర్యాలు మెరుగుపరచడం
3) ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడం
4) డిపాజిట్ల భద్రతను మెరుగుపరచడం
సమాధానం: 2
3. కింది బ్యాంకుల్లో 1969లో దేన్ని జాతీయం చేయలేదు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ పీజీటీ, 2021)
1) యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2) బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) ఆంధ్రా బ్యాంక్ 4) అలహాబాద్ బ్యాంక్
సమాధానం: 3
4. 1969లో మొత్తం ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ (సోషల్ సైన్స్), 2025),
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ సీబీటీ, 2021)
1) 14 2) 13 3) 15 4) 12
సమాధానం: 1
5. Who was the Prime Minister of India when 14 major banks were nationalized in 1969?
(Delhi Police Constable (Executive) 2025)
1) Jawaharlal Nehru 2) Lal Bahadur Shastri
3) Indira Gandhi 4) Morarji Desai
Ans: 3
6. Choose the correct statement.
i. Banks were nationalised in India in 1969 and 1980.
ii. Nationalisation of Banks did bring financial inclusion
(KVS PGT Economics Official Paper 2023)
1) Only i is correct 2) Only ii is correct
3) Both i and ii are correct 4) Both i and ii are incorrect
Ans: 3
7. In 1969, during the initial phase of bank nationalisation in India intended to broaden banking outreach, encourage financial inclusion, and regulate the flow of credit, how many leading commercial banks were brought under government ownership?
(NCL Assistant Foreman (Mechanical) Official Paper 2026)
1) Sixteen 2) Ten 3) Twelve 4) Fourteen
Ans: 4
8. Which of the following banks was the first full-fledged commercial bank of India?
(DSSSB Jail Warder Official Paper 2024)
1) Central Bank of India 2) Imperial Bank
3) Avadh Commercial Bank 4) Punjab National Bank
Ans: 3
9. Which of the following is NOT a commercial bank?
(DSSSB PGT (Political Science) Official Paper 2025)
1) Reserve Bank of India 2) Bank of Baroda
3) Axis Bank 4) State Bank of India
Ans: 1