నెల్సన్‌ మండేలా అంతర్జాతీయ దినోత్సవం

నెల్సన్‌ మండేలా అంతర్జాతీయ దినోత్సవం

మన దేశంలో గాంధీజీలాగే దక్షిణాఫ్రికాలో మండేలాను శాంతి, అహింసకు చిహ్నంగా పేర్కొంటారు. జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడి, నల్లజాతి సూరీడుగా పేరొందారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన సాగించిన అలుపెరుగని పోరాటం తరతరాలకు స్ఫూర్తి కలిగిస్తూనే ఉంది. నెల్సన్‌ మండేలా జయంతిని పురస్కరించుకుని ఏటా జులై 18న ‘నెల్సన్‌ మండేలా అంతర్జాతీయ దినోత్సవం’గా నిర్వహిస్తారు. ఆయన ఆశయాలైన అందరికీ విద్య, మానవ హక్కుల రక్షణ, లింగ సమానత్వం, పేదరిక నిర్మూలన మొదలైనవాటిని సమాజంలోకి తీసుకెళ్లడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 

  • మండేలా అసలు పేరు నెల్సన్‌ రోలిహ్లాహ్లా మండేలా. 1918, జులై 18న దక్షిణాఫ్రికాలోని ట్రాన్స్‌కీ ప్రాంతంలో ఉన్న ఉమ్టాటాలో జన్మించారు. ఆ రోజుల్లో దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష అధికంగా ఉండేది. నల్ల జాతీయులను హీనంగా చూసేవారు. మండేలా కూడా అణచివేతకు గురయ్యారు. వివిధ కారణాలతో ఆయన జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఈ పరిణామాలు ఆయన్ను మానవ హక్కుల సాధన కోసం పోరాడేలా చేశాయి.
  • మండేలా 1944లో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ)లో చేరారు. అప్పుడే ఏఎన్‌సీ యూత్‌ లీగ్‌ (ఏఎన్‌సీవైఎల్‌) ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 1948లో దక్షిణాఫ్రికా నేషనలిస్ట్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. నల్ల, తెల్ల జాతీయులను విభజించి ఉంచడం వీరి విధానం. దీన్ని వ్యతిరేకించే ఏఎన్‌సీ పార్టీ నాయకుడైన మండేలా అనేక సమ్మెలు, ఉద్యమాలు నిర్వహించారు. దీంతో ఆయన అనేకసార్లు అరెస్టు అయ్యి, జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
  • దక్షిణాఫ్రికా నేషనలిస్ట్‌ పార్టీ అమలు చేసిన వర్ణవివక్ష విధానానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మండేలా 1952లో దక్షిణాఫ్రికా మొదటి నల్లజాతి న్యాయ సంస్థను (Black law firm) ప్రారంభించారు. 1961లో ఏఎన్‌సీ సాయుధ విభాగమైన ‘ఉమ్‌ఖోంటో వె సిజ్వే’ను స్థాపించారు. 1962, జనవరి 11న ఆయన రహస్యంగా దక్షిణాఫ్రికాను విడిచివెళ్లారు. సాయుధ పోరాటానికి మద్దతు కూడకట్టేందుకు ఆఫ్రికా మొత్తం పర్యటించి, ఇంగ్లండ్‌ వెళ్లారు. 
  • జాతి వివక్షకు వ్యతిరేకంగా మండేలా చూపిన తెగువ, నిబద్ధత నేటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా మండేలా నిలిచారు. శాంతి, న్యాయం, అహింస కోసం మండేలా చేసిన కృషికి గుర్తుగా ఏటా ఆయన పుట్టిన రోజైన జులై 18న ‘నెల్సన్‌ మండేలా అంతర్జాతీయ దినోత్సవం’గా జరపాలని ఐరాస 2009లో అధికారికంగా ప్రకటించింది. 2010 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
మండేలా రాజకీయ జీవితం, రచనలు, పురస్కారాలు, ఇతర ముఖ్యాంశాలతోపాటు గతంలో ఈ టాపిక్‌పై ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌ పీవో మెయిన్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. నెల్సన్‌ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(జేవీవీఎన్‌ఎల్‌ టెక్నికల్‌ హెల్పర్, 2018)

1) జులై 17            2) జులై 18

3) జులై 19            4) జులై 20

సమాధానం: 2

2. నెల్సన్‌ మండేలా జీవిత కాలం?
(బీపీఎస్సీ అసిస్టెంట్, 2014)

1) 1916 - 2013    2) 1917 - 2013

3) 1918 - 2013    4) 1916 - 2012

సమాధానం: 3

3. మండేలా కింది ఏ దేశానికి అధ్యక్షుడిగా పనిచేశారు?
(డీఎస్‌ఎస్‌ఎస్‌బీ టీజీటీ, 2023)

1) దక్షిణాఫ్రికా                 2) భారతదేశం

3) సూడాన్‌                   4) అమెరికా

సమాధానం: 1

4. ‘లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడం’ గ్రంథ రచయిత ఎవరు?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2023)

1) ఆంగ్‌ సాన్‌ సూకీ                2) మహాత్మా గాంధీ

3) దలైలామా                     4) నెల్సన్‌ మండేలా

సమాధానం: 4

5. Who among the following is associated with apartheid in South Africa?
(Bihar Prohibition Constable, 2022)

1) George Mason            2) Nelson Mandela        

3) Kofi Annan            4) Thomas Paine

Ans: 2

6. Nelson Mandela became the first elected President of South Africa on 10th May 1994. How many years did he spend behind bars before becoming the President? 
(MPSC Prelims, 2015 )

1) 27 years        2) 23 years        3) 17 years            4) 13 years

Ans: 1
 
7. What was the name of the system that Nelson Mandela fought against?
(TNPSC Group-II, 2024)

1) Civil Rights        2) Apartheid        3) Violence        4) Sathi

Ans: 2
 
8. Who has been awarded 'Nelson Mandela World Humanitarian Award 2021'?
(DSSSB TGT, 2021)

1) Amina Hydari        2) Paramjit Khurana        

3) Ravi Gaikwad        4) Rumana Sinha Sehgal

Ans: 4

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram