ప్రపంచ దేశాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ సంస్థల్లో అంతర్జాతీయ నేర న్యాయస్థానం (International Criminal Court - ICC) ఒకటి. ప్రపంచవ్యాప్తంగా న్యాయం, జవాబుదారీతనం, మానవ హక్కుల రక్షణను పెంపొందించే లక్ష్యంతో ఏటా జులై 17న ‘అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం’గా (International Criminal Justice Day) నిర్వహిస్తారు. దీని ఏర్పాటు, ప్రాముఖ్యాన్ని తెలియజేయడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
అంతర్జాతీయ నేర న్యాయస్థానం
చారిత్రక నేపథ్యం
ప్రపంచవ్యాప్తంగా నేరాల కట్టడికి ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో 1998, జులై 17న రోమ్ నగరంలో ఒక సమావేశం జరిగింది. దేశాల మధ్య యుద్ధాలు, మానవాళికి వ్యతిరేకంగా నేరాలు, దురాక్రమణలకు వ్యతిరేకంగా ‘అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని’ ఏర్పాటు చేయాలని సదస్సులో ఒక ఒప్పందాన్ని ఖరారు చేశారు. దీన్నే రోమ్ ఒప్పందం అంటారు. 2002, జులై 1 నుంచి ఐసీసీ అమల్లోకి వచ్చింది. 2010, జూన్ 1న ఉగాండాలోని కంపాలాలో జరిగిన ఐసీసీ సర్వసభ్యవేశంలో ఏటా జులై 17న ‘అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం’గా జరుపుకోవాలని సభ్యదేశాలు తీర్మానించాయి.
|
ఐసీసీ విధులు, విభాగాలు, అధికార పరిధి - పనితీరు, ఇతర ముఖ్యాంశాలతోపాటు గతంలో యూజీసీ నెట్, సీయూఈటీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. జాతి నిర్మూలన, మతతత్వ వ్యతిరేక నేరాలు, యుద్ధ నేరాల విచారణను కింది ఏ సంస్థ నిర్వహిస్తుంది?
(యూపీ పోలీస్ ఎస్‌ఐ, 2021)
1) అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు
2) ప్రపంచ న్యాయస్థానం
3) శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం
4) అంతర్జాతీయ న్యాయస్థానం
సమాధానం: 1
2. ఐసీసీ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు?
(ఓఎస్‌ఎస్‌ఎస్‌సీ ఆర్‌ఐ, ఏఆర్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఎస్, 2025)
1) పియోటర్ హోఫ్‌మాన్స్కి 2) టొమోకో అకానే
3) సిల్వియా ఫెర్నాండెజ్ 4) సాంగ్-హ్యూన్ సాంగ్
సమాధానం: 2
3. అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(జేకేఎస్‌ఎస్‌బీ ఎస్‌ఐ, 2022)
1) ఏప్రిల్ 9 2) జులై 17 3) ఆగస్టు 5 4) ఫిబ్రవరి 11
సమాధానం: 2
4. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
(మద్రాస్ హైకోర్టు (రీడర్/ సీనియర్ బెయిలిఫ్/ జిరాక్స్ ఆపరేటర్), 2022)
1) ది హేగ్ 2) పారిస్ 3) స్కాట్లాండ్ 4) ఐర్లాండ్
సమాధానం: 1
5. Which of the following characterise International Criminal Court (ICC)?
A) The Rome statute established ICC as 'Court of last resort'
B) ICC can exercise jurisdiction only when national courts are unwilling or unable to investigate or prosecute
C) It can not prosecute acts of war crimes
D) ICC is not located in the Hague
Choose the correct answer from the options given below:
(UGC NET Paper 2: Political Science, 2020)
1) (A) and (B) only 2) (B) and (C) only
3) (C) and (D) only 4) (A) and (D) only
Ans: 1
6. Which of the following statements about the International Court of Justice is/are correct?
I. The Court consists of members, wherein two members cannot be nationals of the same State.
II. The General Assembly and the Security Council proceed independently of one another to elect the members of the Court.
Select the correct answer using the code given below.
(CDS General Knowledge, 2024)
1) I only 2) II only
3) Both I and II 4) Neither I nor II
Ans: 3