ఐసీఏఆర్‌ వ్యవస్థాపక దినోత్సవం

ఐసీఏఆర్‌ వ్యవస్థాపక దినోత్సవం

మన దేశంలో వ్యవసాయం, మత్స్య, పశు విజ్ఞానం (animal sciences), ఉద్యాన రంగాల్లో పరిశోధన, విద్యను నిర్వహించడానికి; మార్గనిర్దేశం చేయడానికి; సమన్వయానికి ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థే భారత వ్యవసాయ పరిశోధన మండలి (Indian Council of Agricultural Research -ICAR). ఇది మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ వ్యవసాయ నెట్‌వర్క్‌లలో ఒకటి. భారత వ్యవసాయ పరిశోధన మండలి స్థాపనకు గుర్తుగా మన దేశంలో ఏటా జులై 16న ఐసీఏఆర్‌ వ్యవస్థాపక దినోత్సవంగా నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో విద్య, పరిశోధన అంశాల్లో ఐసీఏఆర్‌ చేసిన విశేష కృషిని గుర్తించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

ఐసీఏఆర్‌ గురించి..

  • ఇది మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ పరిధిలోని ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (డీఏఆర్‌ఈ) ఆధ్వర్యంలో పనిచేసే స్వయం ప్రతిపత్తి సంస్థ.
  • గతంలో దీన్ని ఇంపీరియల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్ రిసెర్చ్‌ అని పిలిచేవారు.
  • ఇది విజ్ఞానశాస్త్రం, సాంకేతిక అభివృద్ధికి సంబంధించిన అత్యాధునిక రంగాల్లో కృషి చేస్తోంది.
  • దేశవ్యాప్తంగా హార్టికల్చర్, మత్స్య, పశువైద్య శాస్త్రాలతో సహా వ్యవసాయ రంగంలో పరిశోధన, విద్యను సమన్వయం చేయడం, నిర్దేశించడం, నిర్వహించడంలో ఐసీఏఆర్‌ అత్యున్నత సంస్థగా వ్యవహరిస్తోంది.
  • దీని ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది.

చేపట్టిన కార్యక్రమాలు

  • ఫార్మర్స్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌: రైతులను వ్యవసాయాన్ని విజ్ఞానశాస్త్రంతో అనుసంధానించి, వారి వ్యవసాయ పద్ధతులు విజ్ఞానశాస్త్ర ఆధారంగా ఉండాలనే లక్ష్యంతో ఐసీఏఆర్‌ 2020, జనవరి 6న ఫార్మర్స్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ను నెలకొల్పింది.
  • నేషనల్‌ అగ్రికల్చరల్‌ ఇన్నోవేషన్‌ ప్రాజెక్ట్‌ (ఎన్‌ఏఐపీ): ఐసీఏఆర్‌ 2006, జులైలో దీన్ని ప్రారంభించింది. సాంకేతిక ఆధారిత వ్యవసాయ నవకల్పనలను ప్రోత్సహించడం, గ్రామీణ పేదరికాన్ని తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం.
  • నేషనల్‌ అగ్రికల్చరల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రాజెక్ట్‌ (ఎన్‌ఏహెచ్‌ఈపీ): ఐసీఏఆర్‌ 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఏహెచ్‌ఈపీని ప్రారంభించింది. దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, విద్యార్థుల పురోగతికి తోడ్పడే వనరులు, యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం

  • రాయల్‌ కమిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ నివేదిక ఆధారంగా 1929, జులై 16న సొసైటీల నమోదు చట్టం, 1860 కింద ‘ఇంపీరియల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్ రిసెర్చ్‌’ ఏర్పాటైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1965లో దీన్ని మొదటిసారి పునర్‌వ్యవస్థీకరించి, దాని పేరును ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రిల్చరల్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌)గా మార్చారు. అప్పటి నుంచే ఏటా జులై 16న ఐసీఏఆర్‌ వ్యవస్థాపక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇది అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలు అభివృద్ధి చేయడం, పశుసంపద నిర్వహణను మెరుగుపరచడం లాంటి కార్యక్రమాలు చేస్తుంది. తద్వారా ఆహార దిగుమతులపై ఆధారపడిన భారత్‌లో వరి, గోధుమ, పాల ఉత్పత్తిలో అగ్రగామిని చేయడంపై ఈ మండలి కీలకపాత్ర పోషిస్తుంది.
  • వ్యవసాయ వృద్ధిలో ఐసీఏఆర్‌ పాత్ర, ముఖ్యమైన మైలురాళ్లు, చేపట్టిన ఇతర కార్యక్రమాలతోపాటు

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఐసీఏఆర్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2025)

1. డిసెంబరు 23            2. జులై 16

3. ఏప్రిల్‌ 22                4. నవంబరు 23 

సమాధానం: 2

2. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ (ఐసీఏఆర్‌) కింది ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
(రాజస్థాన్‌ సీఈటీ, 2023)

1. 1919               2. 1929

3. 1939               4. 1959

సమాధానం: 2

3. ఐసీఏఆర్‌ను మొదటిసారి ఎప్పుడు పునర్‌ వ్యవస్థీకరించారు?
(ఎంపీ పట్వారీ, 2017)

1. 1956                2. 1965

2. 1969                4. 1972

సమాధానం: 2

4. ICAR stands for:
(HTET TGT Social Studies 2018)

1. Indian Council of Agro Research

2. Indian Committee of Agriculture Review

3. Indian Commercial and Agro Research

4. Indian Council of Agricultural Research

Ans: 4

5. The Indian Council of Agricultural Research (ICAR) has classified Indian soils into how many major categories?
(RRB NTPC, 2021)

1. 6          2. 7

3. 8          4. 9

Ans: 3

6. According to the Indian Council of Agricultural Research (ICAR), which major farming system is prevalent in approximately 3.16 million hectares of central Punjab?
(Punjab Police Constable Official Paper-I & II, 2025)

1. Pulses and oilseeds.           2. Cotton-sugarcane.

3. Rice and wheat.              4. Maize-Millet

Ans: 3

7. ICAR, which is the Indian Institute of Wheat and Barley Research, is located in:
(JSSC JE Re-Exam, 2022)

1. Ludhiana              2. Karnal

3. Panipat                4. Chandigarh

Ans: 2

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram