ప్రస్తుత కాలంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం ఎంతో అవసరం. ప్రధానంగా నూతన సాంకేతికతను నేర్చుకోవడం, సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై ఎక్కువగా దృష్టిసారించాలి. ముఖ్యంగా యువత ఈ విషయంలో ముందుండాలి. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత, భవిష్యత్తులో ఏర్పడే సవాళ్లను ఎదుర్కొని, పరిష్కరించవచ్చు.(ఈ టెక్ట్స్ కేవలం పేజీకి మాత్రమే. పోస్ట్స్‌కి వద్దు) ఈ క్రమంలోనే యువతలో నైపుణ్యాభివృద్ధే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా జులై 15న ‘వరల్డ్ యూత్ స్కిల్స్ డే’గా నిర్వహిస్తారు. నిరుద్యోగం, ఉపాధిలేమి, సవాళ్లను అధిగమించేందుకు సరైన నైపుణ్యాల్లో వారు శిక్షణ తీసుకునేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
| భారత నైపుణ్యాల నివేదిక-2026, నివేదికలోని అంశాలు, దేశంలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వ తీసుకున్న చర్యలతో సహా గతంలో ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, యూపీఎస్సీ తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. భారతదేశంలో మొదటి స్కిల్ యూనివర్సిటీని కింది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?
(ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్ 1, 2024)
1) రాజస్థాన్ 2) ఉత్తర్ ప్రదేశ్
3) పంజాబ్ 4) హరియాణా
సమాధానం: 1
2. ‘వరల్డ్ యూత్ స్కిల్స్ డే’ను ఏ తేదీన నిర్వహిస్తారు?
(ఓపీఎస్సీ ఓఎస్, 2018)
1) జులై 10 2) జులై 15
3) జులై 17 4) జులై 31
సమాధానం: 2
3. సంకల్ప్ కార్యక్రమానికి కింది ఏ సంస్థ నుంచి రుణ సాయం లభిస్తుంది?
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ 2024)
1) ఆసియా అభివృద్ధి బ్యాంక్ 2) అంతర్జాతీయ ఆర్థిక సంస్థ
3) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 4) ప్రపంచ బ్యాంక్
సమాధానం: 4
4. In the context of the Skill India Programme, which of the following observations is/are correct?
i) It was launched in 2015 under the Ministry of Skill Development and Entrepreneurship.
ii) The Skill India Programme is designed exclusively for individuals aged 18 to 30 years.
Select the correct option from the codes given below:
(RRB NTPC (UG) CBT-I Official Paper 2025)
1) i only 2) ii only 3) i, ii 4) None of these
Ans: 1
5. What is the theme of World Youth Skills Day, 2021?
(UPPSC Combined State Exam, 2021)
1) Young People and Skills
2) Skills Development and Employment
3) Young People and Entrepreneurship
4) Reimagining Youth Skills Post Pandemic
Ans: 4
6. How many technicians is the Skill India Mission targeted to train by the year 2022-23 under the framework of the India Cooling Action Plan?
(RPF Constable 2025)
1) 100,000 2) 50,000
3) 250,000 4) 500,000
Ans: 1