నాబార్డ్‌ వ్యవస్థాపక దినోత్సవం

నాబార్డ్‌ వ్యవస్థాపక దినోత్సవం

దేశంలో వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి ఆర్థిక సహాయం అందించే అత్యున్నత బ్యాంకింగ్‌ సంస్థ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ - నాబార్డ్‌). సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదక కార్యకలాపాలకు రుణాలు అందించే విత్త సంస్థలకు పునర్విత్త (పరోక్ష) సహాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశం. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు సంస్థాగతంగా ఆర్థిక మద్దతు ఇస్తూ, గ్రామీణ శ్రేయస్సును పెంపొందిస్తోంది.(పేజీకి మాత్రమే. పోస్ట్స్‌కి వద్దు) నాబార్డ్‌ ఏర్పాటును పురస్కరించుకుని ఏటా జులై 12న ‘నాబార్డ్‌ వ్యవస్థాపక దినోత్సవం’గా (NABARD Foundation Day) నిర్వహిస్తారు. 

  • రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు బి. శివరామన్‌ అధ్యక్షతన 1979లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇది వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన రుణ సమస్యలపై సమగ్రంగా దృష్టి సారించాలని పేర్కొంటూ, ఇందుకోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాల్సిందిగా తన నివేదికలో పేర్కొంది. ఈ సిఫార్సుల ఆధారంగా, 1981 చట్టం ప్రకారం జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) ఏర్పాటుకు పార్లమెంట్‌ ఆమోదం లభించింది.
  • 1982, జులై 12 నుంచి ఇది ఉనికిలోకి వచ్చింది.
నాబార్డ్‌ చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు, ఇతర ముఖ్యాంశాలతోపాటు గతంలో ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రెటరీ, తెలంగాణ పోలీస్‌ ఎస్‌ఐ మెయిన్స్, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ మెయిన్స్‌ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 90కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. నాబార్డ్‌ ఎప్పుడు ఏర్పాటైంది?

(ఎంపీపీఎస్సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కామర్స్, 2017),

(ఎస్‌ఎస్‌సీ సీపీఓ టైర్‌ 1, 2019), (ఎంపీపీఎస్సీ స్టేట్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్, 2023),

(ఆర్‌పీఎస్సీ గ్రేడ్‌ 2, 2017), (ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్, 2020)

1) 1947, ఆగస్టు 15            2) 1951, ఏప్రిల్‌ 1

3) 1982, జులై 12             4) 1950, జనవరి 26

సమాధానం: 3

2. నాబార్డ్‌ ఒక ....

(ఎస్‌ఎస్‌సీ జేఈ ఈఈ, 2014)

1) డిపార్ట్‌మెంట్‌     2) బ్యాంక్‌        3) బ్యూరో         4) బోర్డ్‌

సమాధానం: 2

3. నాబార్డ్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

(దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్, 2020)

1) దిల్లీ       2) కోల్‌కతా        3) ముంబయి  4) బెంగళూరు

సమాధానం: 3

4. కింది ఏ కమిటీ సిఫార్సు మేరకు నాబార్డ్‌ను స్థాపించారు?

(ఎంపీ పట్వారీ, 2017)

1) పబ్లిక్‌ అకౌంట్‌ కమిటీ        2) శివరామన్‌ కమిటీ

3) నరసింహం కమిటీ            4) పైవేవీ కాదు

సమాధానం: 2

5. NABARD stands for _________.
(MSTET Varg 2 Social Science 2019)
1) National Bank for Agriculture and Rural Development
2) National Bank for Agriculture Reconstruction Development
3) National Board of Agronomy and Rural Development
4) National Board of Agriculture and Rural Development
Ans: 1
6. Which institution launched the Self-Help Group - Bank Linkage Programme in 1992-93?
(SSC CGL 2023)
1) SBI        2) NABARD        3) SIDBI        4) IDBI
Ans: 2
7. Which of the following statements is incorrect about NABARD? 
(MP Police Constable 2023)
1) NABARD was established in 12 July 1982
2) It's headquaters are in Mumbai
3) It was established under the Seventh Five-year plan 
4) It provides credit facility for the promotion and development of agriculture
Ans: 3 
8. What type of a bank is NABARD?
(RRC Group D Previous Paper 2018)
1) Commercial Bank focused on Trade & Industry
2) Private Bank focused on Technological development
3) Cooperative Bank focused on Social and Urban Development
4) Development Bank focused on Agricultural and Rural Development
Ans: 4

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram