ఒక ప్రదేశంలో నివసించే ప్రజల సంఖ్యను జనాభా అంటారు. దేశ ప్రగతికి, పతనానికి ఇది ప్రధాన కారణంగా నిలుస్తుంది. అవసరమైన స్థాయిలో పెరిగే జనాభా అభివృద్ధికి దోహదపడితే, మితిమీరిన జనాభా వృద్ధి అధోగతికి దారితీస్తుంది. (ఇది పేజీకి మాత్రమే. పోస్ట్స్‌కి వద్దు) మరణాల రేటు తగ్గుతూ, జననాల రేటు పెరిగితే మొత్తం జనాభాలో పెరుగుదల కనిపిస్తుంది. దీన్నే ‘జనాభా విస్ఫోటనం’ అంటారు. ప్రస్తుతం భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఈ దశలోనే ఉన్నాయి. జనాభా పెరుగుదల వల్ల కలిగే సమస్యలు, సమాజంపై దాని ప్రభావాన్ని తెలియజేసే లక్ష్యంతో ఏటా జులై 11న ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ (World Population Day) గా నిర్వహిస్తారు. కుటుంబ నియంత్రణ, లింగసమానత్వం మొదలైనవాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
| టీఎస్‌పీఎస్‌సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, తెలంగాణ పోలీస్ ఎస్‌ఐ మెయిన్స్, ఏపీపీఎస్సీ గ్రూప్-1, యూపీఎస్సీ - సివిల్స్, ఫారెస్ట్ గార్డ్, ఎస్‌ఎస్‌సీ - సీజీఎల్, ఎంటీఎస్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ తదితర పోటీపరీక్షల్లో ఈ అంశంపై అడిగిన 140కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. వయసు ఆధారంగా ఒక దేశ జనాభాను సాధారణంగా ఎన్ని ప్రధాన వర్గాలుగా విభజించారు?
(ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, 2022)
1) 4 2) 5 3) 3 4) 2
సమాధానం: 3
2. భారతదేశ జనాభా కింది ఏ దేశ జనాభా కంటే ఎక్కువ?
(డబ్ల్యూబీసీఎస్ మెయిన్స్, 2023)
1) అమెరికా 2) చైనా 3) ఇండోనేసియా 4) పైవన్నీ
సమాధానం: 4
3. భారతదేశంలో మొదటి జనాభా గణన ఏ సంవత్సరంలో చేశారు?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2022)
1) 1872 2) 1860 3) 1900 4)1920
సమాధానం: 1
4. జనసాంద్రత అంటే?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2025)
1) ఒక ఇంటిలో ఉండే జనాభా 2) చదరపు కిలోమీటరుకు ఉండే జనాభా
3) ఒక ప్రాంతంలోని జనాభా 4) ఒక జిల్లాలోని జనాభా
సమాధానం: 2
5. The distribution of population in India is:
(RRB NTPC (UG) CBT-I, 2025)
1) uniform across all regions 2) more in desert areas
3) denser in hilly regions 4) uneven, with variations across regions
Ans: 4
6. India is the second most populous country with a population of ______, according to the 2011 census data.
(SSC HSC, 2022)
1) 1,210 million 2) 1,678 million 3) 1,245 million 4) 1,300 million
Ans: 1
7. Natural growth of population is the outcome of which of the following?
I. Crude Birth Rate II. Crude Death Rate
III. Migration IV. Marriages
Select the correct answer from the codes given below:
(UPPSC Civil Service, 2018)
1) Only I 2) Only III 3) II and IV 4) I and II
Ans: 4
8. In the Indian context, population growth in Class I cities is the most influenced by _____.
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) natural increase 2) migration from rural areas
3) religious factors 4) government employment
Ans: 2