ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం

ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం

దేశాభివృద్ధి ప్రధానంగా గ్రామాల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. మన దేశంలో నేటికీ అత్యధిక జనాభా ప్రధానంగా పల్లెల్లోనే నివసిస్తున్నారు. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, పశుపోషణ. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్‌ సంక్షేమ రాజ్యంగానే ఉంది. ప్రభుత్వాలు కూడా గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నాయి.

  • గ్రామీణాభివృద్ధి అనేది ప్రజల ఆర్థిక అభ్యున్నతితోపాటు విస్తృతమైన సామాజిక పరివర్తనను కూడా సూచిస్తుంది. సుస్థిరాభివృద్ధిని సాధించడంలో పల్లె ప్రాంతాల కీలక పాత్రను చాటే లక్ష్యంతో ఏటా జులై 6న ‘ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం (World Rural Development Day)’గా నిర్వహిస్తారు. గ్రామీణ సమాజాల్లో విద్య, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛమైన నీరు, ఆర్థిక అవకాశాలను బలోపేతం చేయడంపై ఈ రోజు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. 

గ్రామీణాభివృద్ధి అంటే?

  • గ్రామీణాభివృద్ధి అనేది పల్లె ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలను, సాధారణ శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ. పేదరికాన్ని తగ్గించడం, ఉపాధి కల్పన, విద్య - ఆరోగ్యం - పారిశుద్ధ్యం - గృహ వసతి లాంటి ప్రాథమిక అవసరాలు కల్పించడం, నైపుణ్యాలు, వ్యవసాయాభివృద్ధి, వనరుల సుస్థిర వినియోగం, సామాజిక సంక్షేమ కార్యక్రమాల పరంగా గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించడం ఇందులో ముఖ్యమైన అంశాలు.
  • 2025-26 ఆర్థిక సర్వే ప్రకారం, మన దేశంలో 65% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. ఉపాధి కల్పనలో గ్రామీణ రంగం వాటా 46శాతంగా ఉంది. వ్యవసాయాభివృద్ధితోపాటు వినియోగ డిమాండ్‌ మెరుగవుతుండటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకత బలపడిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2026-27 కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ మంత్రిత్వ శాఖకు రూ.2,73,108 కోట్లు కేటాయించారు.  

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన - గ్రామీణ్‌

  • 2022 నాటికి అందరికీ గృహ వసతి అనే లక్ష్యంతో గతంలో ఉన్న గ్రామీణ గృహ నిర్మాణ పథకమైన ఇందిరా ఆవాస్‌ యోజన (ఐఏవై) స్థానంలో 2016, ఏప్రిల్‌ 1న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన - గ్రామీణ్‌ను ప్రారంభించారు. దీన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. పేదరిక రేఖకు దిగువన ఉన్న గ్రామీణ ప్రజలకు పూర్తి గ్రాంట్‌ రూపంలో సాయం చేయడం ద్వారా గృహ నిర్మాణంలో తోడ్పాటు అందిస్తారు.

గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ

  • గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ (Training of Rural Youth for Self-Employment - TRYSEM) కార్యక్రమాన్ని 1979, ఆగస్టు 15న ప్రారంభించారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3500 కంటే తక్కువగా ఉన్న 18-35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన గ్రామీణ యువకులకు శిక్షణ ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. అర్హత ఉన్న కుటుంబాల నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. తర్వాతి కాలంలో స్వయం ఉపాధికే కాకుండా వేతన ఉపాధికి కూడా ఈ పథకాన్ని విస్తరించారు.  
  • ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) చొరవతో 1979, జులై 6న ఢాకా కేంద్రంగా ‘ది సెంటర్‌ ఆన్‌ ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ ఆసియా అండ్‌ ది పసిఫిక్‌ (సీఐఆర్‌డీఏపీ)’ ఏర్పాటైంది. ఇది ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని 15 సభ్య దేశాల్లో సమీకృత గ్రామీణాభివృద్ధి వ్యవస్థలను ప్రోత్సహించడం, బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది.
  • ప్రపంచ అభివృద్ధితోపాటు సుస్ధిరాభివృద్ధిలో ముఖ్య లక్ష్యాలైన పేదరికం - ఆకలి నిర్మూలన, సుస్థిర వ్యవసాయం లాంటివి సాధించాలంటే గ్రామీణాభివృద్ధి కీలకమని ఐక్యరాజ్యసమితి భావించింది. దీని సాధన కోసం సీఐఆర్‌డీఏపీ చేస్తోన్న కృషికి గుర్తింపుగా దాని వ్యవస్థాపక దినోత్సవమైన జులై 6న ‘ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం’గా జరుపుకోవాలని 2024, సెప్టెంబరులో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానించింది. 2025 నుంచి దీన్ని ఏటా నిర్వహిస్తున్నారు.
వీబీ - జీ రామ్‌జీ చట్టం, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ - గ్రామీణ కౌశల్‌ యోజన (డీడీయూ- జీకేవై), జవహర్‌ రోజ్‌గార్‌ యోజన, కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం, సంసద్‌ ఆదర్శ గ్రామ యోజన (ఎస్‌ఏజీవై) మొదలైన సమాచారంతోపాటు ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, తదితర పోటీపరీక్షల్లో అడిగిన ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్‌.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్, ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ నాలెడ్జ్‌ & కరెంట్‌ అఫైర్స్‌ కోర్సు’కి సబ్‌స్క్రైబ్‌ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978

 గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఏటా జులై 6న నిర్వహించే ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవాన్ని మొదటిసారి ఎప్పుడు జరిపారు?
(హెచ్‌పీపీఎస్సీ జీఎస్, 2025)

1) 2023    2) 2024        3) 2025    4) 2021

సమాధానం: 3

2. భారతదేశంలో గ్రామీణాభివృద్ధికి కింది ఏ రంగం వెన్నెముకగా నిలుస్తుంది?
(ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్, 2024)

1) తయారీ రంగం     2) పర్యాటకం

3) ఐటీ రంగం        4) వ్యవసాయం

సమాధానం: 4

3. భారతదేశంలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుకు కింది ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది?
(ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, 2025)

1) సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ

2) వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ

3) పంచాయతీ రాజ్‌ మంత్రిత్వ శాఖ

4) గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

సమాధానం: 4

4. What is the primary rural development challenge addressed by the National Rural Livelihood Mission (NRLM)?
(DSSSB MTS, 2026)

1) Provision of healthcare facilities

2) Enhancement of self-employment opportunities

3) Improvement of road infrastructure

4) Supply of safe drinking water

Ans: 2

5. Which of the following programs aims at self-employment for the rural poor?
(RRB NTPC (Graduate), 2026)

1) Mahatma Gandhi National Rural Employment Guarantee Act

2) Deendayal Antyodaya Yojana

3) National Rural Health Mission

4) Pradhan Mantri Awas Yojana

Ans: 2

6. Which organisation does the Ministry of Rural Development cooperate with for rural development in Asia and the Pacific?
(RRB NTPC Graduate Level, 2025)

1) Asian Development Bank (ADB)

2) World Bank

3) Centre on Integrated Rural Development for Asia and Pacific (CIRDAP)

4) African-Asian Rural Development Organization (AARDO)

Ans: 3  

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram