దేశమంతా ఒకే పన్ను విధానం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పన్నుల వ్యవస్థలో మార్పులు చేసి వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ను తీసుకొచ్చింది. ఒకే దేశం - ఒకే పన్ను భావనతో దీన్ని అమలు చేస్తోంది. దీంతో భారత్‌లో మిగిలిన పరోక్ష పన్నులు ఏవీ ఉండవు. పన్నుల సరళీకరణ జరిగి వ్యాపారం సులభతరమవుతుంది. దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ఏటా జులై 1న ‘జీఎస్టీ దినోత్సవం’గా (GST Day) నిర్వహిస్తారు. మన దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
వస్తుసేవల పన్ను (జీఎస్టీ)
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అనేది భారత్ వ్యాప్తంగా దేశీయ వినియోగం కోసం సరఫరా చేసే వస్తువులు, సేవలపై విధించే పరోక్ష పన్ను. వినియోగదారులు ఈ పన్నును కొనుగోలు సమయలో చెల్లిస్తారు. సంబంధిత వస్తు, సేవలు అందించే వ్యాపార సంస్థలు దీన్ని వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తాయి. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన అనేక పరోక్ష పన్నులను ఏకీకృతం చేసి, వాటి స్థానంలో జీఎస్టీ వచ్చింది. మనదేశంలో కలిపిన విలువ పన్ను (Value Added Tax - VAT) స్థానంలో జీఎస్‌టీని ప్రవేశపెట్టారు.
| జీఎస్టీ రాజ్యాంగపరమైన చట్రం, ప్రపంచ దేశాల్లో జీఎస్టీ, జీఎస్టీలో విలీనమైన పన్నులు, పన్ను రేట్లు, చివరగా మార్పు, జీఎస్టీ కౌన్సిల్ తదితర సమాచారంతోపాటు గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్, తెలంగాణ పోలీస్ ఎస్‌ఐ, యూపీఎస్సీ సివిల్స్, ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఏఎల్‌పీ, ఎస్‌బీఐ క్లర్క్స్ మెయిన్స్ తదితర పోటీపరీక్షల్లో అడిగిన 90కి పైగా ప్రశ్నలు - జవాబులతో రూపొందించిన ఈబుక్.. ఇంకా పోటీపరీక్షల్లో వచ్చే కీలక జీకే అంశాలు, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్ట్స్ కోసం ‘ఈనాడు ఈప్రతిభ జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ కోర్సు’కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. వివరాల కోసం లింక్ పై క్లిక్ చేయండి. https://hov.to/69b00978 |
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
1. జీఎస్టీ పూర్తి రూపం?
(ఎన్‌టీపీసీ, 2020)
1) గూడ్స్ అండ్ సర్‌ఛార్జ్ ట్యాక్స్ 2) గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్
3) జనరల్ సర్వీస్ ట్యాక్స్ 4) జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ట్యాక్స్
సమాధానం: 2
2. భారతదేశంలో జీఎస్టీని ఎప్పుడు ఆమోదించారు?
(ఎంపీ పోలీస్ పట్వారీ గ్రూప్ 2, 2023)
1) 2016 2) 2014 3) 2007 4) 2017
సమాధానం: 1
3. జీఎస్టీ కౌన్సిల్‌కి ఛైర్‌పర్సన్‌గా కింది ఎవరు వ్యవహరిస్తారు?
(ఎన్‌డీఏ, 2022)
1) భారత ప్రధానమంత్రి 2) కేంద్ర ఆర్థికమంత్రి
3) లోక్‌సభ స్పీకర్ 4) భారత రాష్ట్రపతి
సమాధానం: 2
4. జీఎస్టీని అమలు చేసిన మొదటి దేశం?
(ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2019)
1) కెనడా 2) జర్మనీ 3) అమెరికా 4) ఫ్రాన్స్
సమాధానం: 4
3. As per the Goods and Services Tax (Period of Levy and Collection of Cess) Rules, 2022, notified by the Finance Ministry, up to which date will the GST compensation cess be levied in India?
(RRB NTPC Graduate Level CBT-I, 2025)
1) 30 June 2025 2) 31 December 2025
3) 31 March 2026 4) 31 December 2026
Ans: 3
4. Goods and Services Tax, an indirect tax levied in stages from the manufacturer to the consumer for value addition, is of
(UP Police Assistant Operator, 2024)
1) 4 types 2) 400 types 3) Only one type 4) 40 types
Ans: 1
5. Which one of the following statements is true about GST?
(Supreme Court Junior Court Assistant, 2022)
1) It is a direct tax
2) It became operational in 2015
3) It amalgamated a large number of central and state taxes and cesses
4) It has variances and slabs according to the requirement of states
Ans: 3