2047 నాటికి వికసిత భారత్‌గా ఎదగాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో దేశంలోని పెట్టుబడుల వాతావరణాన్ని అంచనా వేయడానికి నీతిఆయోగ్ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేసింది. దీనికి అనుగుణంగా పెట్టుబడుల సౌకర్య సూచిక (ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్)ను రూపొందించి, ఆ నివేదికను 2026, జులై 17న విడుదల చేసింది. మొత్తం 8 విభాగాల్లో 953 కొలమానాల ఆధారంగా అధ్యయనం చేసింది. పలు సంస్థల అభిప్రాయాలు, 1,850 మంది పెట్టుబడిదారుల స్పందనలు విశ్లేషించి ర్యాంకులు ఇచ్చింది.