విద్యాభ్యాసం కోసం జర్మనీకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2025తో పోలిస్తే 2026 జనవరి-జూన్ మధ్య 370% పెరిగినట్లు లీప్ స్కాలర్స్ కౌన్సెలింగ్ నివేదిక వెల్లడించింది. కృత్రిమ మేధ, డేటా ఆధారిత కోర్సుల్లో చేరేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు 1,24,000 మంది విద్యార్థుల దరఖాస్తులు, కౌన్సెలింగ్ సమాచారాన్ని, ఇతరత్రా వివరాలను విశ్లేషించిన లీప్ స్కాలర్ సంస్థ దీన్ని రూపొందించింది. తక్కువ ఖర్చుతో విద్యాభ్యాసం చేసేందుకు అవకాశం ఉన్న గమ్యంగా మాత్రమే కాకుండా జర్మనీలో ఉపాధి అవకాశాలు, వీసా మార్గాలు, భాషాపరమైన సౌలభ్యం వంటివి చూసుకుని విద్యార్థులు అటువైపు మొగ్గు చూపిస్తున్నారని సంస్థ నివేదిక పేర్కొంది.