‘ఎమర్జింగ్‌ ఫ్యూచర్స్‌’ నివేదిక

‘ఎమర్జింగ్‌ ఫ్యూచర్స్‌’ నివేదిక

ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐడీపీ’ విదేశీ విద్య చదవాలనుకుంటున్న, ఇప్పటికే దరఖాస్తు చేసిన, ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్న వారి అభిప్రాయాలు సేకరించి ‘ఎమర్జింగ్‌ ఫ్యూచర్స్‌’ పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం, గతంలో విదేశీ విద్య కోసం ఒకే దేశంపై దృష్టి సారించి.. యువత అక్కడికే వెళ్లేవారు. ఇప్పుడు ఎక్కువ మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలను పరిశీలిస్తున్నారు. 118 దేశాలకు చెందిన 5,800 మంది యువతీ యువకుల అభిప్రాయాలను సేకరించి ఈ అంశాలను విశ్లేషించింది. సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికంగా భారత్‌ నుంచి 962 మంది, చైనా నుంచి 817 మంది, నైజీరియా నుంచి 666 మంది ఉన్నారు. 2026, మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య ఈ సర్వే నిర్వహించారు. రెండు, అంతకంటే ఎక్కువ దేశాల్లో పరిణామాలను తెలుసుకుంటూ విద్య విషయంలో ప్రపంచ యువత ‘గ్లోబల్‌ షాపింగ్‌’ చేస్తోందని సర్వే వెల్లడించింది. ఈ ధోరణి ఏటేటా అధికమవుతున్నట్లు సర్వే స్పష్టంచేసింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram