ప్రపంచవ్యాప్తంగా ప్రతి అయిదుగురిలో ఒకరు క్యాన్సర్ బారినపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా నివేదిక పేర్కొంది. సన్నిహిత కుటుంబ సభ్యులు ఈ వ్యాధి కోరల్లో చిక్కుకోవడం లాంటి కారణాలతో కలిపితే 92 శాతం మంది జీవితంలో కనీసం ఒక్కసారైనా క్యాన్సర్ వల్ల ప్రభావితమవుతున్నట్లు వివరించింది. ఈ వ్యాధి వల్ల లక్షల మంది శారీరక, భావోద్వేగ, ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని వివరించింది. క్యాన్సర్ నివారణ, వ్యాధి నిర్ధారణ, చికిత్స, ఆసరా వంటి అంశాల్లో అనేక అసమానతలు ఉన్నాయని వివరించింది. దీనివల్ల లక్షల మందికి సేవలు అందడంలేదని పేర్కొంది.