‘ఇండియా బీఈఎస్‌ఎస్‌ మార్కెట్‌ రివ్యూ’

‘ఇండియా బీఈఎస్‌ఎస్‌ మార్కెట్‌ రివ్యూ’

రాబోయే పదేళ్లలో (2035-36 నాటికి) భారత విద్యుత్‌ నిల్వ వ్యవస్థ సామర్థ్యం 888 గిగావాట్‌ అవర్‌కు (జీడబ్ల్యూహెచ్‌) పెరగాల్సి ఉందని ‘ఇండియా బీఈఎస్‌ఎస్‌ మార్కెట్‌ రివ్యూ’ నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఇది 1 గిగావాట్‌ అవర్‌గా ఉంది. పునరుత్పాదక విద్యుత్‌ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు, గ్రిడ్‌ వ్యవస్థ బలోపేతానికి విద్యుత్‌ నిల్వ వ్యవస్థ చాలా కీలకమని వివరించింది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్‌ వీక్‌ (ఐఈఎస్‌డబ్ల్యూ) కార్యక్రమంలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్‌ అలయెన్స్‌ (ఐఈఎస్‌ఏ), కస్టమైజ్డ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌ (సీఈఎస్‌) ఈ నివేదికను విడుదల చేశాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram