ప్రపంచవ్యాప్తంగా పాస్‌పోర్టుల బలాన్ని అంచనా వేసే గ్లోబల్ పాస్‌పోర్టు ఇండెక్స్-2026 జాబితా విడుదలైంది. ఇందులో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుగా స్వీడన్ నిలవగా, భారత్ మాత్రం ఒక స్థానం కోల్పోయి 125వ ర్యాంకుకు చేరింది. గతేడాది భారత్ 124వ స్థానంలో ఉంది. గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ విడుదల చేసిన ఈ నివేదికలో మొత్తం 197 దేశాలు, భూభాగాల పాస్‌పోర్టులను విశ్లేషించారు.