‘లాన్సెట్‌ ఆంకాలజీ కమిషన్‌’ నివేదిక

‘లాన్సెట్‌ ఆంకాలజీ కమిషన్‌’ నివేదిక
  • ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి క్యాన్సర్‌ సంబంధిత వైద్యరంగంలో సుమారు 10 కోట్ల మంది సిబ్బంది కొరత ఏర్పడనుందని ‘లాన్సెట్‌ ఆంకాలజీ కమిషన్‌’ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోని నిపుణులైన వైద్యులు, నర్సులు సంపన్న దేశాలకు వలసపోవడంతో మున్ముందు ముందస్తు వ్యాధి నిర్ధారణే ప్రశ్నార్థకంగా మారనుందని పేర్కొంది.
  • ముఖ్యాంశాలు:
  • నివేదిక ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా కొత్తగా నమోదయ్యే క్యాన్సర్‌ కేసుల సంఖ్య 3.53 కోట్లకు చేరుకుంటుంది. వార్షిక మరణాల సంఖ్య 1.85 కోట్లుగా నమోదయ్యే ప్రమాదం ఉంది. ఇందులో దాదాపు 70% కేసులు ఆఫ్రికా, కొన్ని ఆసియా దేశాల నుంచే ఉంటాయి. 
  • క్యాన్సర్‌ రోగులకు సరైన సంరక్షణ అందించాలంటే... ప్రపంచవ్యాప్తంగా అదనంగా 9.99 కోట్ల మంది సిబ్బంది అవసరమవుతారు. ప్రత్యేకించి 6.5 కోట్ల మంది నర్సులు, 1.6 కోట్ల మంది వ్యాధి నిర్ధారణ నిపుణులు అందుబాటులోకి రావాలి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram