‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సంస్థ భారత్‌లో పనిచేయడానికి అత్యుత్తమ కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆతిథ్య దిగ్గజం హిల్టన్ (గురుగావ్) ఒకటో ర్యాంకు పొందగా, ఐటీ సంస్థ సిస్కో సిస్టమ్స్ ఇండియా-బెంగళూరు(2), హైదరాబాద్‌లోని సింక్రనీ భారత ఆర్థిక సేవల విభాగం సింక్రనీ ఇంటర్నేషనల్ సర్వీసెస్(3) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇంటర్‌కాంటినెంటల్ హోటల్స్ గ్రూప్ (గురుగావ్) నాలుగోర్యాంకు, బెంగళూరులోని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ అయిదో ర్యాంకుల్లో ఉన్నాయి.