దేశంలో పసిడి తనఖాపై తీసుకుంటున్న రుణాల విలువ 2025-26 ఆర్థిక సంవత్సరం చివరకు రూ.19.4 లక్షల కోట్లకు చేరిందని అంతర్జాతీయ డేటా, టెక్నాలజీ కంపెనీ ఎక్స్‌పీరియన్ రూపొందించిన నివేదిక తెలిపింది. పసిడి ధరలు పెరగడం, ఆభరణాల తనఖాపై ఎక్కువ మొత్తం రుణంగా తీసుకోవడం పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. 2022-23 చివరిలో ఈ రుణాల విలువ రూ.6.3 లక్షల కోట్లే. అంటే మూడేళ్లలోనే పసిడి రుణాల విలువ 3 రెట్లు పెరిగింది. ఈ కాలంలో బంగారం ధర కూడా 144% పెరిగింది. ఇదే సమయంలో ఒక రుణ ఖాతా సగటు రూ.98,000 నుంచి రూ.1.96 లక్షలకు చేరింది.