దేశీయంగా తయారీ పెంచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాల వల్ల 2026, మార్చి వరకు రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులు, 14.15 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని లోక్‌సభకు వాణిజ్య, పరిశ్రమల సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. పథకాలన్నీ కలిసి రూ.15.2 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేయగలిగాయన్నారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం..
సామర్థ్యం ఎక్కువగా ఉండే సోలార్ పీవీ మాడ్యూళ్ల రంగంలోకి అత్యధికంగా రూ.64,873 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఫార్మా (రూ.45,158 కోట్లు), వాహన (రూ.44,326 కోట్లు), స్పెషాలిటీ స్టీల్(రూ.23,896 కోట్లు), భారీ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ (రూ.20,580 కోట్లు) రంగాలున్నాయి.