యూపీఐ లావాదేవీలు గత అయిదేళ్లలో (2021-26) భారీగా విస్తరించాయి. లావాదేవీల సంఖ్య పరంగా 425%, విలువలో 273% మేర వృద్ధి నమోదైంది. 2026, జులై 20న లోక్‌సభకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌చౌధరి ఈ సమాచారాన్ని అందించారు. 2026 జూన్ నాటికి యూపీఐ వినియోగదారుల సంఖ్య 55.49 కోట్లకు చేరింది.