భారత సెమీకండక్టర్‌ మిషన్‌ 

భారత సెమీకండక్టర్‌ మిషన్‌ 
  • దేశంలో సెమీకండక్టర్లు.. మొబైల్‌ డిజైన్, తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.89 లక్షల కోట్లు (22 బి. డాలర్లు) కేటాయించింది. ఇందులో భారత సెమీకండక్టర్‌ మిషన్‌ రెండో ఎడిషన్‌కు (సెమీకాన్‌ 2.0) రూ.1.27 లక్షల కోట్లు, మొబైల్‌ ఫోన్ల తయారీని మరింత ప్రోత్సహించేందుకు మరో రూ.62,500 కోట్లు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026, జులై 15న జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
  • సెమీకాన్‌ 2.0 ద్వారా రూ.4 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించొచ్చని, రూ.2 లక్షల కోట్ల విలువైన సెమీకండక్టర్‌ చిప్‌సెట్లు ఉత్పత్తి చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram