ప్రభుత్వం తొలిసారిగా ఉప రంగాల ప్రయోగాత్మక సేవా ఉత్పత్తి సూచీ (ఐఎస్‌పీ)ని 2026 ఏప్రిల్ నెలకు విడుదల చేసింది. సంఘటిత రంగంలోని 19 ఉప రంగాల్లో 14 ఉప రంగాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. టోకు వాణిజ్యం, రిటెయిల్, వసతి-ఆహారం, రోడ్డు రవాణా, విమాన రవాణా, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్ వంటి ఉప రంగాలు మొత్తం సేవా రంగంలో 60% వెయిటేజీ కలిగి ఉన్నాయి. రైల్వే, విమాన రవాణా మినహా అన్ని విభాగాలూ 2026 ఏప్రిల్‌లో సానుకూల వృద్ధి నమోదు చేశాయి.