ప్రత్యక్ష పన్నుల్లో 16% వృద్ధి 

ప్రత్యక్ష పన్నుల్లో 16% వృద్ధి 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు జులై 13 వరకు రూ.6.51 లక్షల కోట్లకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఇదే సమయంలో వసూలైన మొత్తం కంటే ఇది 16% ఎక్కువ. కార్పొరేట్‌ పన్ను వసూళ్లు పెరగడం ఇందుకు ఉపకరించింది. కార్పొరేట్‌ పన్ను నికర వసూళ్లు 22% అధికమై రూ.2.40 లక్షల కోట్లకు చేరాయి. వ్యక్తిగత, అవిభక్త హిందూ కుటుంబాలు సంస్థల నుంచి వసూలైన మొత్తం 12% పెరిగి రూ.3.84 లక్షల కోట్లుగా నమోదైంది. సెక్యూరిటీల లావాదేవీల పన్ను 48% వృద్ధితో రూ.26,429 కోట్లకు చేరింది. రిఫండ్‌లు కూడా 14.57% అధికంగా రూ.1.22 లక్షల కోట్లుగా ఉన్నాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram