నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఈ ఇండిసిస్ లిమిటెడ్ సరికొత్త సూచీని ఆవిష్కరించింది. దేశంలో నిఫ్టీ 500లోని కంపెనీల్లో, అహింసా సూత్రాలతో పనిచేస్తున్న వాటి ఆధారంగా ఈ సూచీని తీసుకొచ్చారు. జంతు సంక్షేమ లక్ష్యంతో, వ్యాపార విధానాలు అవలంబించే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టదలచే మదుపర్ల కోసం దీనిని సృష్టించారు. అహింస ఇన్వెస్ట్‌మెంట్ మూవ్‌మెంట్ (ఏఐఎమ్) కింద అహింస గెయిన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ సూచీలోకి అర్హత గల కంపెనీలను గుర్తించడానికి నైతికత పరిశీలన ప్రక్రియ వినియోగిస్తారు.