ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో భారత వృద్ధి రేటు 6.6 శాతానికి పరిమితం కావొచ్చని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. పశ్చిమాసియా సంక్షోభంతో పెరుగుతున్న ఇంధన ధరలు వృద్ధిపై ప్రభావం చూపొచ్చని తెలిపింది.
2027-28లో వృద్ధి రేటు అంచనాను 7.3 శాతంగానే ఉంచింది. 2026-27 ద్రవ్యోల్బణ అంచనాను సైతం ఏప్రిల్‌లో అంచనా వేసిన 4.5% నుంచి 5.2 శాతానికి ఏడీబీ పెంచింది.