భారత ఆర్థిక వ్యవస్థ 2026లో 6.4%, 2027లో 6.7% వృద్ధిరేటును సాధిస్తుందనిఅంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అధిక వృద్ధిరేటును స్థిరంగా సాధించడం, సంస్కరణలు నిరంతరం కొనసాగిస్తేనే 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే వీలుందని తెలిపింది. అధిక వృద్ధిరేటు కలిగిన పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, ప్రపంచ వృద్ధికి చుక్కానిలా మారిందనీ వివరించింది.