భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో 6.4 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్) అంచనా వేస్తోంది. అంతక్రితం ఏప్రిల్‌లో అంచనా వేసిన 6.5 శాతం కంటే ఇది తక్కువ. అయినప్పటికీ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదుచేస్తున్న దేశంగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది.
2027-28లో భారత్ 6.7 శాతం మేర వృద్ధి కనబరచవచ్చని అంచనా వేసింది. ఇది ఏప్రిల్ అంచనా అయిన 6.5 శాతంతో పోలిస్తే 20 బేసిస్ పాయింట్లు అధికం. ఇంధన ధరల ప్రభావం అప్పటికి తగ్గుతుందన్న భావనల మధ్య ఈ అంచనాలను వెలువరించింది.