2025లో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 44 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.7 లక్షల కోట్లు)గా నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడాన్ని కొనసాగిస్తోందనే విషయాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని పేర్కొంది.