2026, ఆగస్టులో జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్‌నకు భారత జట్టును ప్రకటించారు. 20 మంది సభ్యుల జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. టోర్నమెంట్ ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్, బెల్జియంలో జరగనుంది. భారత జట్టు ఇంగ్లండ్, పాకిస్థాన్, వేల్స్‌తో పాటు గ్రూప్-డిలో ఉంది. ఆగస్టు 15న వేల్స్‌తో పోరుతో భారత్ తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. 17న ఇంగ్లాండ్‌తో, 19న పాకిస్థాన్‌తో తలపడుతుంది.