భారత యువ షట్లర్ సాయి నచికేత్ భట్రాజు (18 ఏళ్లు) ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ అండర్-19 సింగిల్స్ జూనియర్ టైటిల్ గెలిచాడు. 2026, జులై 21న బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఫైనల్లో అతడు 21-8, 21-15తో భారత్‌కే చెందిన కార్తీక్ సుహాస్‌పై గెలిచి విజేతగా నిలిచాడు.
2025లో సైప్రస్ టోర్నీ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నచికేత్... తొలి టోర్నీలోనే క్వార్టర్స్ వరకు వెళ్లాడు. 2026 ఏప్రిల్‌లో జరిగిన స్వీడిష్ జూనియర్ టోర్నీలో మూడో స్థానం సాధించిన నచికేత్.. అదే నెలలో జరిగిన బల్గేరియా ఓపెన్లో క్వార్టర్స్ వరకు వెళ్లాడు. ఆపై ఆల్ ఇంగ్లాండ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా టైటిల్ సాధించాడు.