ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ విజేతగా స్పెయిన్‌ నిలిచింది. 2026, జులై 20న న్యూయార్క్‌-న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో స్పెయిన్‌ 1-0తో అర్జెంటీనాపై విజయం సాధించింది. అదనపు సమయానికి దారితీసిన మ్యాచ్‌లో టోరెస్‌ (106వ) స్పెయిన్‌కు గెలుపు గోల్‌ను అందించాడు. స్పెయిన్‌ జట్టు ఇంతకుముందు 2010లో ప్రపంచకప్‌ గెలిచింది. అర్జెంటీనా మూడుసార్లు (1978, 1986, 2022) విజేతగా నిలిచింది. మరోవైపు మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఇంగ్లాండ్‌ 6-4తో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది. బుకాయో సకా హ్యాట్రిక్‌ (37, 45+1, 87వ నిమిషాల్లో) గోల్స్‌తో ఇంగ్లిష్‌ జట్టును గెలిపించాడు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram