మానవ్, మనుష్‌ 

మానవ్, మనుష్‌ 

ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌ పురుషుల డబుల్స్‌లో మానవ్‌ థక్కర్‌-మనుష్‌ షా జోడీ రెండో ర్యాంకును దక్కించుకుంది. ఏ డబుల్స్‌ విభాగంలోనైనా భారత్‌కు ఇదే ఉత్తమ ర్యాంకు. మహిళల డబుల్స్‌లో దివ్య-యశస్విని జంట పదో ర్యాంకు సాధించగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దియా, మనుష్‌ ద్వయం అయిదో ర్యాంకును సొంతం చేసుకుంది. ర్యాంకింగ్స్‌లో భారత్‌ నుంచి మూడు జోడీలు టాప్‌-10లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram