భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర తాజా ర్యాంకింగ్స్‌లో ఆసియా నంబర్‌వన్‌గా నిలిచాడు. విజయవాడకు చెందిన ఇతడు పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో 225.5 పాయింట్లతో ఆసియా స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 3 స్థానాలు మెరుగుపరుచుకున్న అతడు ఎనిమిదో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. టాప్-10లో భారత్ నుంచి ధీరజ్‌కు మాత్రమే స్థానం దక్కింది.