టీ20ల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌ ఇషాన్‌

టీ20ల్లో నంబర్‌వన్‌ బ్యాటర్‌ ఇషాన్‌
  • టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం సాధించాడు. మరో భారత బ్యాటర్‌ అభిషేక్‌ శర్మను వెనక్కి నెట్టి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇషాన్‌ ఖాతాలో 876 పాయింట్లున్నాయి. అభిషేక్‌ 869 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అభిషేక్, ఇషాన్‌ కంటే ముందు భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రమే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించారు.
  • ఇటీవలే వైస్‌ కెప్టెన్సీ చేపట్టిన తిలక్‌ వర్మ ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉండగా, సూర్యకుమార్‌ యాదవ్‌ ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా ఒక్క స్థానం తగ్గి, వరుసగా 3, 6 ర్యాంకుల్లో నిలిచారు. ఆఫ్గ్గనిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram