ఒలింపిక్స్‌కు భారత మహిళల క్రికెట్‌ జట్టు

ఒలింపిక్స్‌కు భారత మహిళల క్రికెట్‌ జట్టు
  • భారత మహిళల క్రికెట్‌ జట్టు 2028 లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్‌ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో ఆరేసి జట్లు పోటీపడతాయి. టీ20 ఫార్మాట్లో మ్యాచ్‌లు ఉంటాయి.
  • ఒలింపిక్స్‌ క్రికెట్‌కు అర్హత ప్రమాణాలను ఐసీసీ వెల్లడించింది. పురుషుల విభాగంలో ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ స్థానాల్లో ఉన్న ఆఫ్రికా, ఆసియా, ఐరోపా, ఓసియానియా జట్లకు నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత లభిస్తుంది. ఆతిథ్య జట్టుగా పురుషులు, మహిళల విభాగాల్లో ఆడేందుకు అమెరికా ఇప్పటికే అర్హత సాధించింది. రెండు విభాగాల్లో ఆరో స్థానం కోసం క్వాలిఫయర్స్‌ నిర్వహిస్తారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram