వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్, మాల్డోవాల మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తూర్పు ఐరోపా దేశమైన మాల్డోవా పర్యటన సందర్భంగా ఇరుదేశాలు ఆర్థిక సహకారాన్ని, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు అంగీకరించాయి. తమ దేశ సందర్శనకు వచ్చిన తొలి భారత రాష్ట్రపతి అయిన ముర్ముతో మాల్డోవా అధ్యక్షురాలు మయ్యా సందు ద్వైపాక్షిక సహకారానికి అవకాశం ఉన్న పలు విషయాలపై చర్చలు జరిపారు.