కేంద్ర ప్రభుత్వ అప్పు 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.201.17 లక్షల కోట్లకు చేరింది. 2014-15లో రూ.64.11 లక్షలకోట్ల మేర ఉన్న రుణ భారం 12 ఏళ్లలో రూ.137.06 లక్షల కోట్ల (214%) మేర పెరిగింది. ఏటా 10.95%మేర వృద్ధి చెందింది. గత పదేళ్లలో నికరంగా చేసిన అప్పులు రూ.125.99 లక్షల కోట్ల మేర ఉన్నాయి. 2026 జులై 20న కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరీ ఈ విషయాలు వెల్లడించారు.