హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే రైలు

హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే రైలు
  • దేశంలో హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే తొలి రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని జీంద్‌లో 2026, జులై 17న జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా ఇదో ముందడుగు. ఇప్పటివరకూ స్టీమ్, డీజిల్, విద్యుత్‌ రైళ్లు వినియోగించగా.. ఇక హైడ్రోజన్‌ రైళ్లనూ ఉపయోగించనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ హైడ్రోజన్‌ రైలు రూపుదిద్దుకుంది.
  • ఇది శుద్ధ ఇంధన పరిజ్ఞానం. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. ఇందులో దహనచర్య జరగదు. అందువల్ల హానికారక పొగ, కర్బన ఉద్గారాలు వెలువడవు. ధ్వని కూడా తక్కువే. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram