సెంట్రల్ విస్టాను ఇకపై కర్తవ్య భవన్ ప్రాంగణం లేదా ప్రాంతంగా పిలవాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. కేంద్ర ప్రజా పనుల విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 2026, జులై 11న ఆయన మాట్లాడుతూ.. ఇకపై అన్ని అధికారిక పత్రాలు, వ్యవహారికంలోనూ ఈ కొత్త పేరునే వాడాలని చెప్పారు. ఈ ప్రాంతంలోని అన్ని కర్తవ్య భవనాలు, కర్తవ్య మార్గ్, ఈ జోన్ పరిధిలో భవిష్యత్తులో నిర్మించే భవనాలు.. అన్నీ కర్తవ్య భవన్ ప్రాంగణం లేదా ఏరియాగానే పరిగణించాలి అని స్పష్టం చేశారు.