జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించటంపై కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రాష్ట్రగీతం ఉన్నా.. వందేమాతరాన్నే మొదట పాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం..
జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు రాష్ట్ర గీతాన్ని కూడా ఆలపించే ఆనవాయితీ ఉంటే... ముందుగా వందేమాతరం, జనగణమన ఆలపించాక రాష్ట్రగీతం పాడాలి.